బోర్గో లౌదాతొ సి ప్రారంభించిన పోప్ లియో

శుక్రవారం సెప్టెంబర్ 5 న కాస్టెల్ గాండోల్ఫోలో లౌదాతొ సి' గ్రామం (బోర్గో లౌదాతొ సి) ను పోప్ లియో ప్రారంభించారు.
దీనిని "నిరీక్షణా బీజంగాను " మరియు పర్యావరణ సంరక్షణకు నమూనాగా అభివర్ణించారు.
మొదట, ఆయన electric golf cartలో మడోన్నా గార్డెన్‌కు ప్రయాణించారు. అక్కడ ఆయన కొంతమంది కార్మికులను మరియు వారి కుటుంబాలను పలకరించి, కొంతసేపు ప్రార్థన చేశారు.
అనంతరం ఆయన తిరిగి కారులో బొర్గో లౌదాతొ సి తోటలలో పర్యటించారు.
పోప్ఒక చెరువు వద్ద ఆగి అక్కడ చేపలకు ఆహారం ఇచ్చారు.
పోప్ లియో ప్రారంభోత్సవం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు.
బోర్గో లాడాటో సి' అనేది నిరీక్షణా బీజంగా, దీనిని పోప్ ఫ్రాన్సిస్ మనకు వారసత్వంగా వదిలిపెట్టారు
"న్యాయం మరియు శాంతి ఫలాలను ఇవ్వగల విత్తనం నిరీక్షణ" అని పోప్ అన్నారు.
బోర్గో లాడాటో సి ఇప్పుడు జీవావరణ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలనుకునే పిల్లలు మరియు కౌమారదశలో ఉన్న వారికి,
ప్రతిపాదిత వేసవి కార్యకలాపాల్లో పాల్గొనాలనుకునే యువకులకు లేదా ప్రకృతితో తమ విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరింప చేయాలనుకునే వారికి ఈ బోర్గో లౌదాతొ సి తెరిచి ఉంది.