గల్ఫ్ స్ట్రీమ్ - వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తలు ఆందోళన
గల్ఫ్ స్ట్రీమ్ - వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తలు ఆందోళన
వాతావరణ మార్పులు కారణంగా ప్రపంచవ్యాప్తంగా హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. 2025 నాటికి హిమానీనదాలు కరగడం వల్ల గల్ఫ్ స్ట్రీమ్ కూలిపోవచ్చని, కీలకమైన సముద్ర ప్రవాహాన్ని నిలిపివేస్తుందని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.
‘గల్ఫ్ స్ట్రీమ్’... భూమధ్యరేఖ నుంచి, దక్షిణార్థ గోళం నుంచి వేడిని ఉత్తరార్ధ గోళానికి, ధ్రువాల వద్దకు తీసుకెళ్లి.. ఆ ఉష్ణ శక్తిని అక్కడ విడుదల చేసే సహజ కన్వేయర్ బెల్ట్ లాంటి ఉష్ణ ప్రవాహమే ఈ గల్ఫ్ స్ట్రీమ్!
ఈ గల్ఫ్ స్ట్రీమ్ ప్రవహించినంతమేరా ఆయా ప్రాంతాల్లో చలిని నియంత్రిస్తుంటుంది. పశ్చిమ యూరప్ ప్రాంతాలు చలికాలంలో గడ్డకట్టిపోకుండా ఉండడానికి ముఖ్య కారణం ఈ ప్రవాహమే.దీని వెచ్చని జలాలు సహజమైన కన్వేయర్ బెల్ట్‌గా పనిచేస్తాయి. భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వేడిని రవాణా చేస్తూ, దాని మార్గంలో వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి.
పెరుగుతున్న భూతాపం కారణంగా హిమనీ నదాలు కరిగిపోయి ఆ నీరు ఈ ప్రవాహంలో చేరుతుండడం వల్ల ఈ గల్ఫ్ స్ట్రీమ్ దెబ్బతిని ఉష్ణ శక్తిని చేరవేయలేకపోయే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు 1960ల్లోనే హెచ్చరించారు.
కొన్ని దశాబ్దాల్లోనే ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలలో సగటు ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని, ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పరిణామాలకు కారణమవుతుందని అధ్యయనం చేపట్టిన నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమ ఐరోపా వాతావరణాన్ని నియంత్రించడంలో గల్ఫ్ స్ట్రీమ్ కీలక పాత్ర పోషిస్తుంది. దాని వెచ్చని జలాలు ఈ ప్రాంతంలో పరిమిత ఉష్ణోగ్రతలకు ముఖ్యంగా శీతాకాలంలో సహాయపడతాయి.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer