నైజీరియా మరియు కామెరూన్‌లో కిడ్నాప్‌లపై దృష్టిసారించిన పోప్

23 నవంబర్ఆదివారం నాడు సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో త్రికాల ప్రార్థన అనంతరం పోప్ లియో నైజీరియా మరియు కామెరూన్ దేశాలను గురించి ప్రస్తావించారు 

ఇటీవలి రోజుల్లో ఆఫ్రికా దేశాలలో జరిగిన గురువులు, విశ్వాసులు మరియు విద్యార్థుల కిడ్నాప్‌లపై పోప్ తన ఆందోళనను వ్యక్తం చేశారు మరియు వారి విముక్తిని నిర్ధారించాలని అధికారులను కోరారు.

నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలోని సెయింట్ మేరీ హై స్కూల్‌లో శుక్రవారం దాదాపు 315 మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కిడ్నాప్ చేయబడ్డారు.

అదే వారంలో, కామెరూన్‌లోని Ndopలో, బమెండా అగ్రపీఠం నుండి ఆరుగురు కతోలిక గురువులు కిడ్నాప్ చేయబడ్డారు.

సమీపంలోని Bui మేత్రాసనంలోని Jakiri మునిసిపాలిటీలో, ఒక బాప్టిస్ట్ పాస్టర్ కిడ్నాప్ చేయబడ్డారు.

బందీలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను మరియు దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను అని పోప్ అన్నారు .

మన సహోదర సహోదరీల కొరకు మన దేవాలయాలు,పాఠశాలలు ఎల్లప్పుడూ సురక్షితంగా మరియు ఆశాజనకంగా ఉండే ప్రదేశాలుగా ఉండాలని ప్రార్థిద్దాం.