యువత భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించుకోవాలి : పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

యువత భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించుకోవాలి : పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

ఆసియా మరియు పసిఫిక్ పర్యటనలో సింగపూర్ నుండి బయలుదేరే ముందు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు యువతను ధైర్యంగా మరియు స్నేహంతో సంప్రదించాలని కోరారు.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తాను బస చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ రిట్రీట్ సెంటర్‌లో సింగపూర్ గురువులు  మరియు మత ప్రతినిధులతో కొద్దిసేపు సమావేశమైన తర్వాత కతోలిక         జూనియర్ కళాశాలలో యువకులతో సమావేశమయ్యారు.

సుఖవంతమైన జీవితాన్ని మాత్రమే కోరుకునే యువకుడు లావు అవుతాడు’’ అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సెప్టెంబరు 13న యువతకు చెప్పారు. ‘‘అందుకే ‘రిస్క్‌లు తీసుకోండి, బయటకు వెళ్లండి’ అని చెబుతున్నాను అని అయన అన్నారు.

యువకులతో సమావేశంలో, సంస్కృతి, సమాజం మరియు యువత ప్రభుత్వ మంత్రి ఎడ్విన్ టోంగ్ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారితో మాట్లాడుతూ, సింగపూర్‌లోని మత సమాజాలలో గౌరవం మరియు సహనాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ సమావేశంలో సింగపూర్‌కు చెందిన మహా పూజ్య కార్డినల్ విలియం గో మరియు ఇతర గురువులు,  నాయకులు ఉన్నారు.

ముగ్గురు యువకులు -- ఒక హిందువు, ఒక సిక్కు మరియు ఒక కతోలిక యువకులు  వారి మతాంతర సంభాషణల అనుభవాలను పాపు గారితో క్లుప్తంగా పంచుకున్నారు.

ప్రజలు, ముఖ్యంగా యువకులు, కమ్యూనికేట్ చేయడానికి, నేర్చుకోవడానికి మరియు ముందుకు సాగడానికి మీడియాను ఉపయోగించాల్సిన అవసరం ఉందని, అయితే వారు దానికి “బానిసలు” కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer