పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు శాంతియుతంగా జీవించే హక్కు ఉంది - పొప్ ఫ్రాన్సిస్

పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు శాంతియుతంగా జీవించే హక్కు ఉంది - పొప్ ఫ్రాన్సిస్


మహా పూజ్య పోప్ ఫ్రాన్సిస్ గారు ఇజ్రాయెల్ మరియు ఉక్రెయిన్‌లో శాంతి కోసం విజ్ఞప్తి చేయడానికి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పొప్  ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ  యుద్ధాలు ద్వారా  కంటే సంభాషణల  ద్వారా సమస్యలు పరిష్కరించబడాలని ప్రార్థించారు.

పోప్ ఫ్రాన్సిస్ బుధవారం విడుదల చేసిన వీడియో సందేశంలో యుద్ధం వల్ల కలిగే బాధలకు పోప్ తన విచారాన్ని వ్యక్తం చేశారు.  పొప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ "రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి నేటి వరకు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరిగాయని,  మనమందరము యుద్ధాల వలన ఎంతో  బాధపడుతున్నామని అన్నారు.పవిత్ర భూమిలో జరుగుతున్నది చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేసారు.   

పాలస్తీనా ప్రజలకు మరియు ఇజ్రాయెల్ ప్రజలకు "శాంతి హక్కు" ఉందని పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ సందర్భముగా నొక్కిచెప్పారు.పవిత్ర భూమిలో శాంతి నెలకొనాలని, చర్చలు వెల్లివిరియాలని ప్రార్థించాలని విశ్వాసులందరిని కోరారు.

పోప్ గారి  యొక్క వీడియో సందేశంతో పాటు పోప్ వరల్డ్‌వైడ్ ప్రేయర్ నెట్‌వర్క్ నుండి ఒక పత్రికా ప్రకటన వెలుబడింది. ఈ ప్రకటనలో  పాలస్తీనా, ఇజ్రాయెల్ కొరకు విశ్వాసులు అందరు  కలసి  జపమాలలో  పాల్గొనమని కోరారు . ఈ "పీస్‌మేకర్స్ జపమాల" (“Peacemakers” novena)  "ప్రపంచంలో శాంతి" మరియు పవిత్ర భూమి, పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ కోసం" ప్రార్థనలో క్రైస్తవుల అందరిని ఏకం చేయడానికి ప్రయత్నిస్తుంది.