భారత దేశంలో "భిన్నత్వంలో ఏకత్వం బలపడాలి"
వరంగల్ మేత్రాసనం, ఫాతిమానగర్ లోని ఫాతిమా మాత దేవాలయం లో ఒక రోజు పవిత్రాత్మ నూత్నీకరణ సభలు జరిగాయి.
14 మే 2023 న కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ సభలు, దేశమంతటా జరుగుతున్నాయి. కేరళ నుండి ప్రారంభమైన క్రీస్తుని సిలువ ప్రతి మేత్రాసనానికి వెళ్తుంది. 26 అక్టోబర్ 2023 న వరంగల్ మేత్రాసనంలోనికి చేరుకుంది.
26 అక్టోబర్ 2023 సాయంత్రం 5 : 00 గంటలకు ఫాతిమా మాత దేవాలయం ప్రాంగణంలో సిలువను స్వీకరించారు. అనంతరం జపమాల, స్థితిఆరాధన మరియు దైవవాక్యపరిచర్య జరిగాయి. తరువాత దేవాలయం చుట్టూ జరికో ప్రదక్షిణ, దివ్యబలిపూజ అప్రింపబడింది. అనంతరం సిలువను తిరిగి కేరళ సభ్యులకు అందించారు.
విచారణ గురువులు గురుశ్రీ కాసు మర్రెడ్డి గారు, పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ కమల్ మరియు గురుశ్రీ అరుణ్ కుమార్ గారు సమిష్టి దివ్యబలిపూజను అర్పించారు. ఈ సిలువ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం "భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వం బలపడాలి".
తెలుగు రాష్ట్రాలలో ఆదిలాబాద్ మేత్రాసనం తర్వాత ఈ సిలువను స్వీకరించిన రెండవ మేత్రాసనం వరంగల్ మేత్రాసనం.