ప్రభు యేసుని ప్రేమని చాటుతున్న శ్రీమతి జెసింతారాణి

ప్రభు యేసుని ప్రేమని చాటుతున్న శ్రీమతి జెసింతారాణి
హైదరాబాద్ అతిమేత్రాసనం , రామంతాపూర్ లోని పునీత యోహాను గురు విద్యాలయాన్ని శ్రీమతి జెసింతారాణి గారు మరియు తన బృందం సందర్శించారు.
పునీత యోహాను గురువిద్యాలయంలో ఉన్న గురువు విద్యార్థులతో శ్రీమతి జెసింతారాణి గారు సమావేశమయ్యారు.
ఈ సందర్భముగా శ్రీమతి జెసింతారాణి గారు మాట్లాడుతూ " గురువు విద్యార్థులు దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలని , ఇది క్రైస్తవ జీవితానికి పునాదిగా నిలుస్తుంది" అని అన్నారు.
దేవుని సేవ కొరకు పిలవబడిన మీరందరు " దేవుని ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి ఎంచుకోబడ్డారని, ఈ పిలుపు దైవికమైనదని అన్నారు. ఈలోక సంబంధాలను, ఆశలను, కోరికలను విడిచిపెట్టి, దేవుని మహిమ కోసం, ఆయన చిత్తం నెరవేర్చడం కోసం మరియు ఆయన ఉద్దేశ్యాలకు అనుగుణంగా జీవించాలని కోరారు".
ఈకార్యక్రమంలో పునీత యోహాను గురువిద్యాలయ రెక్టర్ ఫాదర్ కొమ్మారెడ్డి మర్రెడ్డి గారు, ఫాదర్ కమలేష్ గారు మరియు సిస్టర్ అరుణ , సిస్టర్ ఫాతిమా గారు పాల్గొని గురువు విద్యార్థుల కొరకు ప్రత్యేక పార్థనలు చేసారు.
శ్రీమతి జెసింతారాణి గారు గురువు విద్యార్థులందరికీ బైబిల్ ను ఇచ్చారు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలని ప్రోత్సహించారు. అలానే తాను ప్రత్యేకంగా వ్రాసిన లూకా సువార్త పుస్తకాలను కూడా వారికి ఉచితంగా అందించారు.
ఈ సందర్భముగా దివ్యవాణి నూతన బిల్డింగ్ కడుతున్న కార్మికుల కుటుంబాలను సందర్శించి వారి కొరకు ప్రార్ధించారు. వారి కుటుంబాలకు కూడా బైబిల్ ను అందజేశారు. శ్రీమతి జెసింతారాణి గారు దివ్యవాణి నూతన బిల్డింగ్ కొరకు అందరు ప్రార్ధించాలని కోరారు.
Article and Design By M kranthi Swaroop