మార్కాపురం లో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం (APSSS)

మహిళా సాధికారతే  లక్ష్యంగా ముందుకు సాగుతున్నా మన APSSS

మార్కాపురం లో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

ఆంద్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థం ( ఎ.పి. యస్. యస్. యస్) మరియు ప్రకాశం డెవలప్మెంట్ సోషల్ సర్వీస్ సంస్థం (పి.డి.యస్.యస్.యస్) వారి సేవలు అభినందనీయమని 16  వ వార్డు కౌన్సిలర్  శ్రీమతి. దారి వేముల హర్షిత బేబీ గారు పేర్కొన్నారు.

ఎ.పి.యస్.యస్.యస్ సంస్థ  అద్యక్షులు, ఏలూరు పీఠాదిపతులు మహా పూజ్య  జయరావు పొలిమెర గారు మరియు పి. డి. యస్. యస్. యస్ సంస్థ అధ్యక్షులు  మహా పూజ్య యమ్. డి. ప్రకాశం గార్ల దివ్య ఆశీస్సులతో మార్కాపురం లో కుట్టు శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు.
ఈ కేంద్రంలో  పేద మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారని కార్యక్రమ నిర్వాహకులు, పి.డి.యస్. యస్. యస్ డైరెక్టరు పాదర్. తోమాస్ జార్జ్  మరియు  ఎ. పి. యస్. యస్. యస్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ఫాదర్  టి. పి. ప్రసాద్ గార్లు పేర్కొన్నారు.

ఈ సందర్భముగా గురుశ్రీ  టి. పి. ప్రసాద్ గారు మాట్లాడుతూ   "పేద, మధ్య తరగతి మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టు శిక్షణ ఒక సాధనంగా దోహదపడుతుందని" అన్నారు. మార్కాపురం లో కుట్టు శిక్షణ కేంద్రం లో మొదటి విడతగా 30  మంది పేద, మధ్య తరగతి మహిళలకు టైలరింగ్‌లో  శిక్షణ ఇస్తున్నట్లు  గురుశ్రీ  టి. పి. ప్రసాద్ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎ. పి. యస్. యస్. యస్ కోఆర్డినేటర్ శ్రీమతి జాన్సీ రాణి, సుజాత , జన నిర్మాణ మహిళలు, శిక్షణ పొంద బోవు మహిళలు పాల్గొన్నారు.