భక్తియుతంగా యువతీ యువకులకు ప్రార్థన సదస్సు

భక్తియుతంగా యువతీ యువకులకు ప్రార్థన సదస్సు
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం లో యువతీ యువకులకు ప్రార్థన సదస్సు భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
విచారణ యువతీ,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆరాధనను గురుశ్రీ సంతోష్ గారు జరిపించారు. ప్రత్యేకంగా సెయింట్ అగస్టీన్ వారి జీవిత చరిత్రను ఆరాధనలో పఠించడం జరిగింది. యువత అగస్టీన్ వారి వలె పాపం నుంచి దేవుని వైపు మరలాలనే సందేశం తెలుసుకోడం జరిగింది.
"యువత శ్రీసభకు మంచి సైనికుల లాగా ఉండాలని, శక్తివంతమైన ప్రార్థన జీవితం జీవించాలి" అని గురుశ్రీ సంతోష్ గారు కోరారు. యువతంతా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. విచారణ గురుశ్రీ సంతోష్ గారు సదస్సు కు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer