• యువతా నిరీక్షణా సంకేతాలుగా నిలవాలన్న పోప్

    Oct 23, 2025
    యువతా నిరీక్షణా సంకేతాలుగా నిలవాలన్న పోప్

    అక్టోబర్ 17 శుక్రవారం మధ్యాహ్నం, పోప్ లియో రోమ్‌కు ఆగ్నేయంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీరప్రాంత పట్టణం ఓస్టియాకు ప్రయాణించారు,

    ఇది మెడిటరేనియన్ ఓడరేవు నుండి కొన్ని నెలల తరబడి పర్యటిస్తున్న ఒక నౌకాయానం అయిన Med25 Bel Espoir సిబ్బందిని కలిసారు

    ఈ నౌకలో వివిధ మతాలకు చెందిన 25 మంది యువకులు ఉన్నారు.

    Marseilleకు చెందిన కార్డినల్ Jean-Marc Aveline కూడా ఉన్నారు,

    ఓడలోని యువకులతో మాట్లాడుతూ, ద్వేషం, హింస మరియు విభజనల మధ్య "నిరీక్షణా సంకేతాలుగా " యువత నిలవాలని వారిని ప్రోత్సహించారు.

    “మనమందరం మానవులమే కాబట్టి, మనం వివిధ దేశాలు, భాషలు, సంస్కృతులు మరియు మతాల నుండి వచ్చినప్పటికీ ఐక్యంగా ఉండగలం.”అని ఇంగ్లీషులో ఆ బృందాన్ని ఉద్దేశించి పోప్ అన్నారు:

    పోప్ యువత ఇచ్చిన బహుమతులకు కృతజ్ఞతలు తెలిపారు - ఓడ చిత్రం, “మధ్యధరా తెల్ల పుస్తకం” మరియు అందరూ సంతకం చేసిన పటం

    "మీ తరం, మరియు మీలాంటి అనేక మంది యువకులు, ఈ రకమైన చొరవను ప్రోత్సహించడం కొనసాగించాలి - ఇది నిజంగా

    ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు మీలాంటి అనేక మంది యువకులను ప్రోత్సహించడం కొనసాగించాలి అని పోప్ఉద్ఘాటించారు

Daily Program

Livesteam thumbnail