HASSS ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుక

HASSS ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జగదేవపూర్ మండలం నిర్మల్ నగర్ గ్రామంలో హైదరాబాద్ ఆర్చిడయోసెస్ సోషల్ సర్వీస్ సొసైటీ (HASSS) వారు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా HASSS డైరెక్టర్ గురుశ్రీ ఆంథోనీ నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడాలని కోరారు. ఆరోగ్యమే మహా భాగ్యంగా సేంద్రీయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఇంటి ఆవరణలో పెరటి తోటలను పెంచుకో వాలని సూచించారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు.
ఈ సందర్భముగా కుట్టు మిషన్ నేర్చుకున్న మహిళలకు సర్టిఫి కేట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో ఆర్డినేటర్ కల్పన, సిబ్బంది ఫాతిమా, కిష్టయ్య, శాంతి, శ్రీహరి మహిళలు పాల్గొన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer