CCBI సర్వసభ్య సమావేశంలో "Antiqua et Nova" విడుదల
![](/sites/default/files/styles/max_width_770px/public/2025-02/v5_5_0.png?itok=ZMQNZIFd)
CCBI సర్వసభ్య సమావేశంలో "Antiqua et Nova" విడుదల
ఫిబ్రవరి 4, 2025 , భువనేశ్వర్ కటక్ అగ్రపీఠంలోని XIM విశ్వవిద్యాలయంలో భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CCBI) 36వ సర్వసభ్య సమావేశం నిర్విజ్ఞానంగా ముగిసింది.
ఈ సమావేశంలో గురువులు, మఠవాసులు మరియు గృహస్థక్రైస్తవులు పాల్గొన్నారు.
దేవుని ప్రజలకు కృతజ్ఞతా లేఖను మరియు పీఠాధిపతుల ఆధ్యాత్మిక సంభాషణలను సంకలనం చేస్తూ తుది పత్రాన్ని ప్రచురించాలని అసెంబ్లీ నిర్ణయించింది.
ఈ తుది పత్రం CCBI పాస్టరల్ ప్లాన్, సినడ్ పత్రం మరియు FABC 50 పత్రంతో సమలేఖనం చేయబడి, భారత శ్రీసభకు ఒక మార్గసూచీగా ఉంటుంది .
కృత్రిమ మేధస్సు మరియు హృదయ జ్ఞానం మధ్య సంబంధంపై డికాస్టరీ ఫర్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది ఫెయిత్ మరియు డికాస్టరీ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రచురించిన "యాంటిక్వా ఎట్ నోవా" (Antiqua et Nova) అనే భారతీయ ముద్రణా పత్రం విడుదల చేశారు