62వ దైవ పిలుపుల దినోత్సవ సందేశాన్ని విడుదల చేసిన పోప్ ఫ్రాన్సిస్
మే 11న వాటికన్లో 62వ దైవ పిలుపుల దినోత్సవం జరగనున్న సందర్భంలో “నిరీక్షణా యాత్రికులు : జీవిత బహుమతి” అనే శీర్షికతో, పోప్ సందేశాన్ని వాటికన్ విడుదల చేసింది
ప్రతి వృత్తిలో, అది నియమిత పరిచర్యలో అయినా, దైవాంకిత జీవితంలో అయినా లేదా సామాన్యులైనా ప్రపంచానికి దేవుని నీరిక్షణా చిహ్నాన్ని అందించే వ్యక్తులుగా ఉండాలని కోరారు.
యువత దేవుని స్వరాన్ని హృదయంతో ఆలకించాలని తద్వారా మన హృదయాలు ఆయన ప్రేమకు చిహ్నాలుగా మారుతాయని పోప్ అన్నారు.
.
ప్రతి వ్యక్తికి దేవుని సందేశాన్ని అందించాలని,మనమంతా దేవునిచే ఎన్నుకోబడి, పిలువబడ్డామని ఆయన అన్నారు.
నేటి కాలంలో యువత నిరాశ మరియు అనేక రకమైన గందరగోళాలకు గురవుతున్నారని మానవ హృదయాన్ని ఎరిగిన ప్రభువు మన కష్టనష్టాల్లో తోడుగా ఉంటారని,యువత దైవ పిలుపును ఆలకించి, తమ జీవితాలను దేవుని వైపుకు, కతోలిక శ్రీసభ వైపుకు తిప్పాలని పోప్ కోరారు
