30న మరియగిరి మహోత్సవం

30న మరియగిరి మహోత్సవం

శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల  సహాయమాత మరియగిరిమాత మహోత్సవాలు ఈ ఏడాది నుంచి 9 రోజులు జరగుతున్నాయి. జనవరి 30న మరియగిరి మహోత్సవం జరగనున్నది.

 శ్రీకాకుళం జిల్లా,  వీరఘట్టం మండలంలోని యు. వెంకమ్మపేట వద్ద మరియగిరి కొండపై వెలసిన మరియమ్మ ఉత్సవాలను శ్రీకాకుళా పీఠాధిపతులు మహా పూజ్య  రాయరాలా విజయ్ కుమార్ గారు మరియు ఎమ్మెల్యే  కళావతి గారు ఆదివారం నాడు ప్రారంభించారు.
మహా పూజ్య  రాయరాలా విజయ్ కుమార్ గారి  ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కళావతి  గారిని గజమాలతో సత్కరించి వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అనంతరం ఇటీవల నూతనంగా నిర్మించిన ప్రార్ధనా ప్రాంగణాన్ని వీరు ప్రారంభించారు.

 ఈ ఏడాది నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు శ్రీకాకుళం మేత్రా సనం పీఠాధిపతి మహా పూజ్య  రాయరాలా విజయ్ కుమార్ గారు  తెలిపారు. ప్రతి ఏటా ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో  విశ్వాసులు పాలకొండ, పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకులం,రాజాం,  తలవరం, తోడి, మరియగిరి, గంగాదం, నాగం, సంకిని, పాలవలస, వీరఘట్టం,దోనుబాయి,ఒడిశా ఇతర ప్రాతాలనుండి హాజరువుతారు.

నవదిన ప్రార్థనలో భాగంగా జనవరి 29వ తేదీ  వరకు  ప్రతి రోజు సాయంత్రం ప్రతి రోజు సాయంత్రం 4-30 ని॥లకు “జపమాల” మరియు  “దివ్య పూజబలి” నిర్వహించనున్నారు.  
శ్రీకాకుళ మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ చల్ల డేవిడ్ గారు ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. 

 

Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer