2025 ప్రపంచ శరణార్థుల దినోత్సవ నేపధ్యాన్ని ప్రకటించిన పొప్ ఫ్రాన్సిస్

2025 ప్రపంచ వలసదారులు మరియు శరణార్థుల దినోత్సవానికి పోప్ ఫ్రాన్సిస్ "వలసదారులు- నిరీక్షణా వేదవ్యాపకులు " అనే నేపధ్యాన్ని ప్రకటించారు .
అక్టోబర్ 4-5 తేదీలలో వలసదారుల మరియు వేదవ్యాపకుల జూబ్లీని జరపనున్నామని వాటికన్ సమగ్ర మానవ అభివృద్ధిని ప్రోత్సహించే డికాస్టరీ సోమవారం మార్చి 3,2025 ప్రకటించింది.
ఈ జూబిలీ సందర్భంగా వలసదారులు మరియు శరణార్థుల ధైర్యం మరియు పట్టుదల భవిష్యత్తులో ప్రతిరోజూ వారి నిరీక్షణకు సాక్షులవుతారని ప్రకటన పేర్కొంది.
"వలసదారులను మరియు శరణార్థులను స్వాగతించే సంఘాలలో వారు నిరీక్షణా వేదవ్యాపకులు అవుతారు" అని ఈ ప్రకటన పేర్కొంది
"తరచుగా వారి విశ్వాసాన్ని పునరుజ్జీవింపజేయడానికి మరియు సాధారణ విలువల ఆధారంగా మతాంతర సంభాషణను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని కూడా అన్నారు.
1914లో స్థాపించబడిన ప్రపంచ వలసదారులు మరియు శరణార్థుల దినోత్సవం, సంఘర్షణ, హింస మరియు ఆర్థిక ఇబ్బందుల ద్వారా స్థానభ్రంశం చెందిన కతోలికులను గుర్తుంచుకోవడానికి మరియు వారి కోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలిపిస్తుంది .