188వ అగస్టీనియన్ జనరల్ చాప్టర్‌ను ప్రారంభించిన పోప్ లియో

రోమ్‌లోని సెయింట్ అగస్టీన్ బసిలికాలో 188వ జనరల్ చాప్టర్ ప్రారంభ దివ్యబలిపూజను పోప్ లియో సమర్పించారు 

ఈ వేడుక అధికారికంగా సెప్టెంబర్ 18 వరకు కొనసాకానుంది మరియు నూతన Prior General of the Order ఎన్నికపై దృష్టి పెట్టనున్నారు.

ఈ సమావేశానికి 46 దేశాల నుండి 73 మంది ఓటింగ్ ప్రతినిధులను హాజరు కాగా, పోప్  ఆంగ్లంలో ప్రసంగించారు...

ఇటాలియన్‌  భాషలో మాట్లాడుతూ పవిత్రాత్మ మార్గదర్శకత్వంలో ఈ జనరల్ చాప్టర్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పోప్ వారిని ఆహ్వానించారు

పవిత్రాత్మ గతంలో మాదిరిగానే నేడు కూడా మాట్లాడతారు 

"penetralia cordis"ద్వారా మరియు మన జీవిత పరిస్థితుల ద్వారా పవిత్రాత్మ మాట్లాడతారు.  శ్రీసభ శతాబ్దాల నాటి సంప్రదాయానికి అనుగుణంగా  ఈ సమావేశంలో ఇతరుల మాటలు వినడం ఆ దేవుని స్వరం వినినంత ముఖ్యం అని పోప్ అన్నారు

సామూహిక వివేచనకు అవసరమైన మూడు వైఖరులను పోప్ తెలియచేసారు 

రాబోయే రోజులలో సువార్తను ఆలకించడం, వినయం మరియు ఐక్యత అనే మూడు ఉపయోగకరమైన సూచనలు అని ఆయన అన్నారు 

సెప్టెంబర్ 1, 1977న అగస్టీనియన్ నోవిషియేట్‌లోకి పోప్ లియో ప్రవేశించిన వార్షికోత్సవం మరియు 188వ జనరల్ చాప్టర్‌ ప్రారంభోత్సవం ఒకే రోజు కావడం యాదృచ్చికం.