“ప్రగాఢ విశ్వాసంతో దివ్యసంస్కారాలు స్వీకరించడం దేవుని పట్ల నిబద్ధతను బలపరుస్తుందన్న మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్
కర్నూల్ మేత్రాసనం,ఆర్డర్ ఆఫ్ కార్మెలైట్స్ సెయింట్ థామస్ ప్రావిన్స్ ఆధ్వర్యంలో కోసిగి,సెయింట్ జార్జ్ చర్చి మరియు సుంకేశ్వరి కార్మెల్ మాతా చర్చి 300 మంది పిల్లలు మొదటి పవిత్ర దివ్యసత్ప్రసాదం స్వీకరించారు.
ఈ వేడుక డిసెంబర్ 28 శనివారం జరిగింది.
కోసిగిలోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ క్యాంపస్‌లో కర్నూల్ పీఠకాపరి మహా పూజ్య డాక్టర్ గోరంట్ల జ్వాన్నెస్ OCD ఆధ్వర్యంలో ఈ సాంగ్యా ఘనంగా జరిగాయి.
ఆహారం శరీరాన్ని పోషించినట్లే పవిత్ర దివ్యసత్ప్రసాదం ఆత్మను పోషిస్తుందని, అయితే పవిత్రాత్మ బహుమతులు మరియు ఫలాలను స్వీకరించే గొప్ప సమయం అని పీఠాధిపతులవారు అన్నారు.
విశ్వాసులు ఈ దివ్య సంస్కారాలను లోతైన విశ్వాసం మరియు అవగాహనతో స్వీకరించాలని, దేవుడికి మరియు కతోలిక శ్రీసభ పట్ల వారి నిబద్ధతను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వేడుకలో గురుశ్రీ కోలా విజయ్ రాజు (ఆదోని డీనరీ డీన్), గురుశ్రీ టోనీ తేక్కుంపురత్ ఓ.కార్మ్ (కోసిగి పారిష్ వికార్), గురుశ్రీ థామస్ మవున్‌కల్ ఓ.కార్మ్ (సుంకేశ్వరి పారిష్ ప్రీస్ట్) మరియు గురుశ్రీ జాన్సన్ కున్నాత్‌తో సహా దాదాపు 1,250 మంది విశ్వాసులు పాల్గొన్నారు
9 మంది SABS మఠకన్యలు మరియు 3 మేత్రాసన యానిమేటర్‌ల కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు