స్వీడన్ సామూహిక కాల్పుల బాధితుల కొరకు ప్రార్దించిన పోప్ ఫ్రాన్సిస్
![](/sites/default/files/styles/max_width_770px/public/2025-02/v2_6_0.png?itok=_nVerRm4)
ఫిబ్రవరి 4 ,మంగళవారం స్వీడన్‌లోని ఒక పాఠశాలలో జరిగిన సామూహిక కాల్పుల్లో 10 మంది మరణించారు, వారందరికీ పోప్ ఫ్రాన్సిస్ తన సానుభూతిని వ్యక్తం చేశారు.
కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పియట్రో పరోలిన్, పొప్ ఫ్రాన్సిస్ తరపున పంపిన సంతాప టెలిగ్రామ్‌లో, ఈ విషాదం పట్ల తన విచారాన్ని స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్‌కు ( Ulf Kristersson)కు హామీ ఇచ్చారు.
సెంట్రల్ స్వీడన్‌లోని ఓరెబ్రో Örebro నగరంలో మంగళవారం కనీసం 10 మంది ప్రాణాలను బలిగొన్న ప్రాణాంతక కాల్పుల ఘటనపై తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఆ బాధాకరమైన సంఘటనతో ప్రభావితమైన వారందరికీ పోప్ తన ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని అందించారు
అంతేకాకుండా, పోప్ తన సందేశంలో, "మరణించిన వారి ఆత్మల శాంతి, వారి కోసం దుఃఖిస్తున్న కుటుంబాలు మరియు స్నేహితులకు ఓదార్పు మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు" చేశారు.
"స్వీడన్ లో,ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు సర్వశక్తిమంతుడైన దేవుడు ఐక్యత మరియు శాంతిన ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అని పోప్ ఫ్రాన్సిస్ పునరుద్ఘాటించారు.