సెయింట్ పీటర్స్ బసిలికాలో శాంతి ప్రణాళికలపై చర్చ

దివంగత పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల ముందు, అమెరికా సంయుక్త రాష్ట్రాల మరియు ఉక్రెయిన్ అధ్యక్షులు ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధంపై ఫలవంతమైన చర్చలు జరిగాయి
ఉక్రెయిన్లో రష్యా యుద్ధం ప్రారంభం నుండి,దాదాపు ప్రతి బహిరంగ సమావేశాలలోను పోప్ ఫ్రాన్సిస్ యుద్ధాన్ని ముగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మరియు "అమరవీరులైన ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్ధించారు.
శనివారం, పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య అలాంటి సంభాషణ జరిగింది.
వైట్ హౌస్ ప్రతినిధి ఈ చర్చను "చాలా ఉత్పాదకత" గా అభివర్ణించారు.
వాటికన్ లో ట్రంప్ తో భేటీ అనంతరం Zelensky సోషల్ మీడియాలో స్పందించారు.
"మన ప్రజల ప్రాణాలను కాపాడటం. పూర్తిగా కాల్పుల విరమణ. మరొక యుద్ధం జరగకుండా నిరోధించే విశ్వసనీయమైన మరియు శాశ్వత శాంతి కొరకు సవివరంగా చర్చించారు.
ఈ చర్చలు ఫలితాలు ఫలవంతమైతే, దివంగత పోప్ తరచుగా మాట్లాడే 'న్యాయమైన శాంతి' సాధించబడితే - అది పొప్ ఫ్రాన్సిస్ చేసిన మొదటి అద్భుతం కావచ్చు అని Zelensky
అన్నారు.