సుంకరి జక్కయ్య వలె హృదయ పరివర్తన పొందామని పిలుపునిచ్చిన పొప్ ఫ్రాన్సిస్

మార్చి 23 ఆదివారం రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ కాసా శాంటా మార్టా తన నివాసంలో కోలుకుంటున్నందున.
పొప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 2,2025 సామాన్య ప్రజల సమావేశం కొరకు సిద్ధపరచిన సందేశాన్ని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసింది.
ఆ సందేశంలో సుంకపు గుత్తదారి జక్కయ్య వలె ప్రతి వ్యక్తి క్రీస్తును తెలుసుకొని,హృదయ పరివర్తన కలిగి జీవించాలని, క్రీస్తు ప్రేమలో జీవితాలను మార్చుకోవాలని విశ్వాసులను కోరారు.
ధనాశలో కూరుకుపోయిన జక్కయ్య ప్రభువును కల్లారా చూసి,తన హృదయంలోకి తన గృహంలోకి ప్రభువును ఆహ్వానించి తన జీవితాన్ని మార్చుకున్నాడని,
మనం కూడా కొన్ని సందర్భాలలో ఈ లోకాశలలో పడి తప్పిపోతుంటామని,అటువంటి సందర్భాలలో క్రీస్తే నిజ దేవుడని తెలుసుకొని,జక్కయ్య వలే మారుమనసు పొందాలని,ప్రభు బాటలో జీవించాలని పొప్ ఫ్రాన్సిస్ కోరారు