సాధికారత విద్యా పర్యావరణ వ్యవస్థ - మార్పును ముందుండి నడిపిద్దాం

హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య కార్డినల్ పూల అంతోని

సాధికారత విద్యా పర్యావరణ వ్యవస్థ - మార్పును ముందుండి నడిపిద్దాం

20 సెప్టెంబర్ 2024 న, సికింద్రాబాద్ లోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్ లో  "సాధికారత విద్యా పర్యావరణ వ్యవస్థ - మార్పును ముందుండి నడిపిద్దాం" కార్యక్రమం ప్రారంభమైయింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారు మైఖ్య అతిధిగా విచ్చేసారు. 

ఆంధ్ర మరియు తెలంగాణలో విద్య యొక్క ప్రత్యేక లక్షణాలు మరియు సవాళ్లపై అంతర్దృష్టి. ప్రాంతీయ అవకాశాలు మరియు సహకారాన్ని పెంపొందించే క్రైస్తవ మైనారిటీ సంస్థలుగా తెలంగాణ మేత్రాసనంలోని విద్యాసంస్థలకు ప్రత్యేక సూచనలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అగ్రపీఠం వికార్ జనరల్ గురుశ్రీ బాలశౌరి, తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య విద్యా కమిషన్ కు సెక్రటరీ గురుశ్రీ వి.కె. స్వామి, సెయింట్ పాట్రిక్స్ స్కూల్ కరస్పాండెంట్ గురుశ్రీ దూసి రవి శేఖర్ ముఖ్య వ్యాఖ్యాతలుగా విచ్చేసారు. 

ఉదయం 9 : 30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. "విద్యా వ్యవస్థను సాధికారత చేయడం వల్ల విద్యార్థులను విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, అనుకూలతని పెంపొందించే జ్ఞానంతో సన్నద్ధం చేస్తుంది. ఇది విద్యార్థులను జీవితాంతం మారుతున్న ప్రపంచానికి సిద్ధం చేయడమేనని" ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో సుమారు 170 మంది పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం లోని అనేక కతోలిక  విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, గురువులు, కన్యస్త్రీలు అందరు కలిపి సుమారు 180  మంది ఈ కార్యకమంలో పాల్గొన్నారు.