సంఘర్షణ ప్రాంతాలలో శాంతి కొరకు ప్రార్దించిన పోప్ ఫ్రాన్సిస్
![](/sites/default/files/styles/max_width_770px/public/2025-02/v4_6_0.png?itok=aPhwdQjJ)
సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సాయుధ దళాలు, పోలీసులు మరియు భద్రతా సిబ్బంది కొరకు జూబ్లీ దివ్యబలిపూజ ముగింపులో, శాంతి స్థాపనకు తోడ్పడే విషయాలను పాస్టరల్ కాన్స్టిట్యూషన్ , "Gaudium et spes " నుండి పోప్ ఫ్రాన్సిస్ తెలియచేసారు
ఈ జూబ్లీ వేడుకకు హాజరైన వారందరినీ, పాస్టరల్ సేవకు సైనిక చాప్లిన్‌లను మరియు ప్రపంచవ్యాప్తంగా సైనిక సేవలో ఉన్నవారికి ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు.
"తమ దేశ సైనిక సేవకు తమను తాము అంకితం చేసుకునే వారు తమను తాము ప్రజల భద్రత మరియు స్వేచ్ఛకు ప్రతినిధులుగా భావించుకోవాలి" అని పోప్ వారిని ప్రోత్సహించారు
సాయుధ సేవ "ఆత్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగించబడాలి, ఇతర దేశాలపై ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించకూడదు, అంతర్జాతీయ నియమాలను ఎల్లప్పుడూ పాటిస్తూ, జీవితం మరియు సృష్టి పట్ల గౌరవంతో" ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ముగింపులో, "బాధించబడిన" ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయెల్మ,మధ్యప్రాచ్యం, మయన్మార్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు సూడాన్ అంతటా శాంతి నెలకొనాలని ప్రార్థిస్తూ పోప్ ఫ్రాన్సిస్ ముగ్గించారు