శాంతి కొరకు అక్టోబర్ 7ను ప్రత్యేక ఉపవాస దినంగా పాటించండి - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

శాంతి కొరకు అక్టోబర్ 7ను ప్రత్యేక ఉపవాస దినంగా పాటించండి - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

ప్రస్తుత సమయంలో, యుద్ధం యొక్క గాలులు మరియు హింస యొక్క మంటలు మొత్తం ప్రజలను మరియు దేశాలను నాశనం చేస్తూనే ఉన్నాయి" అని, మనమందరం ప్రతి చోటా శాంతి చిగురించాలని ఆకాంక్షిస్తూ, "మానవత్వంతో సేవ చేయాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

అక్టోబర్ 7న అనగా జపమాలమాత మహోత్సవం నాడు ఆ దినాన్ని ప్రతి ఒక్కరూ శాంతి కోసం ప్రత్యేక ఉపవాస ప్రార్థన దినంగా కొనియాడాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై అక్టోబర్ 7కు ఒక సంవత్సరం అవుతుంది.

సైనాడ్ జనరల్ అసెంబ్లీ రెండవ సెషన్ ప్రారంభం కోసం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో దివ్య బలిపూజ అనంతరం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రసంగించారు.

వార్షికోత్సవానికి ముందు రోజు అక్టోబరు 6న సెయింట్ మేరీ బసిలికా సందర్శనలో తనతో పాటు రావాలని అతను సైనాడ్ సభ్యులందరినీ ఆహ్వానించారు.  అక్కడ ప్రపంచ శాంతి కోసం మరియమాత మద్యస్థ ప్రార్ధనను హృదయపూర్వక విన్నపం" చేస్తానని చెప్పాడు.

“మనం ప్రభువు చెప్పేది విందాం. మరియు ఆత్మ ద్వారా నడిపించబడదాం అని,  మనం అందరం  కలిసి నడుద్దాం" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer