వేళాంగణి మాత వద్దకు అద్భుతమైన సైకిల్ యాత్ర

వేళాంగణి మాత వద్దకు అద్భుతమైన సైకిల్ యాత్ర
సికింద్రాబాద్‌లోని భోయిగూడలోని సెయింట్ జాన్ మరియా వియానీ విచారణకు చెందిన సైక్లిస్ట్ శ్రీ రేమండ్ ఫ్రాన్సిస్ తన స్నేహితుడు మార్క్ లుమెన్ తో కలసి వేళాంగణి మాత వద్దకు 4వ సారి సైకిల్ యాత్రను పూర్తి చేసారు.
హైద్రాబాద్ లోని ఖైరతాబాద్ దేవాలయం నుండి చెన్నై లోని వేలంకన్ని చర్చి వరకు ఈ అద్భుతమైన సైక్లింగ్ యాత్ర జరిగింది. ఈ అసాధారణ భక్తి ప్రయాణం సెప్టెంబర్ 22 ఉదయం ప్రారంభమై సెప్టెంబర్ 29న వేలంకన్ని చేరుకొనడంతో ముగిసింది.
దారిలో, కొంతమంది విచారణ గురువులు , విశ్వాసులు తమకు ఆహారం, ఆశ్రయం అందించి ప్రోత్సాహాన్ని అందించగా, చాలామంది సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా అతన్ని ప్రోత్సహించారు. వేలంకన్నిలో, జెండా స్తంభం యొక్క బారికేడ్‌పై అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, ఖైరతాబాద్ మాత జెండాను కట్టి తమ యాత్రను ముగించారు.
ఇది విశ్వాసం, ప్రేమ మరియు సంఘీభావంతో జరిగింది ప్రయాణం అని శ్రీ రేమండ్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఇది తన 4వ సైకిల్ యాత్ర అని , 3 సార్లు ఒంటరిగానే హైదరాబాద్ నుండి బయలుదేరి చెన్నై చేరుకొని వేళాంగణి మాతను సందర్శించానని తెలిపారు. తమకు ఆధ్యాత్మికంగా సహకరించిన ఖైరతాబాద్ విచారణకర్తలు ఫాదర్ మైఖేల్ సెల్వరాజ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఖైరతాబాద్ మాత కొరకు ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నామని శ్రీ రేమండ్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు.
గతంలో ప్రపంచానికి శాంతి చేకూర్చాలని శ్రీ రేమండ్ ఫ్రాన్సిస్ గారు ఎవరెస్ట్ క్యాంపును చేరుకొని మరియమాత బ్యానర్ ను ప్రదర్శించారు.
ఈ సైకిల్ యాత్ర స్ఫూర్తిని రేకెత్తిస్తుంది మరియు విన్న వారందరికీ స్ఫూర్తినిస్తుంది. కొన్ని ప్రయాణాలు కిలోమీటర్లలో లెక్కించబడతాయి, మరికొన్ని వాగ్దానాలలో లెక్కించబడతాయి.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer