వేళాంగణి మాత వద్దకు సైకిల్ యాత్ర

వేళాంగణి మాత వద్దకు సైకిల్ యాత్ర

మదర్స్ డే సందర్భముగా  నాగపట్నం  లోని వేళాంగణి మాతను దర్శించుకోవాలని  హైదరాబాద్ నుండి 3వ సారి తన సైకిల్ యాత్రను ప్రారంభించి, విజయవంతంగా మరియ తల్లిని దర్శించుకున్నారు శ్రీ రేమండ్ ఫ్రాన్సిస్ గారు.  

రేమండ్ గారు మాట్లాడుతూ "తన మొదటి సైకిల్ యాత్ర డిసెంబర్ 25, 2021న ప్రారంభమైంది అని , మరియతల్లి అంటే తనకు  అపారమైన ప్రేమ అని, మథర్స్ డే  రోజున ఆ తల్లిని దర్శించుకోవాలని, ఈ యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు.  

మే 3న ఈ యాత్రను ప్రారంభించి సింగరాయకొండ ,నెల్లూరు, చెన్నై,పాండిచ్చేరి మీదుగా ఈ యాత్ర సాగింది. మే 11 న  మదర్స్ డే  రోజున వేళాంగణి మాతను దర్శించు కొన్నట్లు రేమండ్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు. తన తల్లిదండ్రులు ఎస్ జార్జ్ ఫ్రాన్సిస్, జయశీల గార్లు తన వెన్నంటే ఉండి తనను ప్రోత్సహించారని రేమండ్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు.

తనకు సమయం దొరికినప్పుడల్లా  భారతదేశం అంతటా సైకిల్ యాత్ర చేస్తూ  మరియమాత  దేవాలయాలను సందర్శిస్తానని  రేమండ్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు. గతంలో ఎవరెస్ట్  క్యాంపు ను చేరుకొని మరియమాత బ్యానర్ ను ప్రదర్శిస్తూ  ప్రపంచానికి  శాంతి  చేకూర్చాలని , మరియ మాత ఆశీస్సులు అందరిపై   ఉండాలని  కోరుకున్నట్లు శ్రీ రేమండ్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు.

 రేమండ్ ఫ్రాన్సిస్ గారు ఇన్సిగ్నిస్ ట్రాన్స్‌నేషనల్ స్కూల్‌(Insignis Trance national School ) లో ఫిజికల్ ఎడ్యుకేటర్‌గా పనిచేస్తున్నారు.

 

article by

 Mk ranthi Swaroop