వృద్ధులు ప్రభువులో నిరీక్షణ కలిగి జీవించాలన్న పోప్

ఈ సంవత్సరం జూలై 27న శ్రీసభ అవ్వ - తాతల దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో పోప్ లియో ఒక సందేశాన్ని రాసారు.
అబ్రహం మరియు సారా, జెకర్యా మరియు ఎలిజబెత్, మోషే వృద్ధాప్యంలో దేవుని రక్షణ ప్రణాళికలో భాగమైనట్లే దేవుని దృష్టిలో వృద్దాప్యం ఆయన కృపను, దయను స్వీకరించు సమయం అని పోప్ లియో అన్నారు.
వృద్ధులు ప్రభువులో నిరీక్షణ కలిగి జీవించాలని అది ఆనందానికి మూలమని ఆయన అన్నారు.
వృద్ధులకు అండగా ఉంటూ,యువత అనుభవరాహిత్యానికి సాక్షిగా పనిచేయగలరని, ఈ అనుభవం జ్ఞానంతో భవిష్యత్తును నిర్మించుకోవడానికి సహాయపడుతుందని తన సందేశంలో పేర్కొన్నారు.