వీడియో రూపంలో ప్రార్థనా సందేశాన్ని పంపిన హోలీ ఫ్యామిలీ విచారణ

గాజాలోని హోలీ ఫ్యామిలీ విచారణ పోప్ ఫ్రాన్సిస్‌ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతున్నందున ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఒక వీడియో పంపించారు

యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, పోప్ ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు విచారణ ప్రజల ఇజ్రాయెల్ దాడి మధ్య వారి శ్రేయస్సును తనిఖీ చేసేవారు. 

ఇప్పుడు, రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో ఆయన డబుల్ న్యుమోనియాతో పోరాడుతున్నప్పుడు, విచారణ సభ్యులు అదే సాన్నిహిత్యాన్ని తిరిగి పొందుతున్నారు, ప్రార్థన మరియు ప్రోత్సాహంతో కూడిన వీడియో సందేశాన్ని అతనికి పంపారు.

"ప్రియమైన పవిత్ర తండ్రీ, ఈరోజు మాస్ తర్వాత మేము గాజాలో సమావేశమయ్యాము. చాలా చాలా చలిగా ఉంది, కానీ మేము మా కృతజ్ఞతను, మా సాన్నిహిత్యాన్ని మరియు మా ప్రార్థనలను తెలియజేయాలనుకుంటున్నాము. 

ప్రపంచం మొత్తం మీ కోసం ప్రార్థిస్తోంది  మరియు మేము అందరం మీకు మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాము." ఆ వీడియోలో ఉంది