వాటికన్ గవర్నరేట్ సెక్రటరీ జనరల్‌లను నియమించిన పొప్ ఫ్రాన్సిస్

పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీ గవర్నరేట్‌కు ఇద్దరు కొత్త సెక్రటరీ జనరల్‌లను నియమిస్తూ, దాని అధ్యక్షురాలిగా ఎన్నికైన సిస్టర్ రఫెల్లా పెట్రినికి వారి బాధ్యతలను అప్పగించే అధికారాన్ని ఇచ్చారు.
పోప్ ఫ్రాన్సిస్ మే 13, 2023 లో వాటికన్ సిటీ స్టేట్ ప్రాథమిక చట్టాన్ని మరియు నవంబర్ 25, 2018 న వాటికన్ సిటీ స్టేట్ ప్రభుత్వంపై లా నంబర్ CCLXXIV ను సవరించారని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ మంగళవారం ప్రకటించింది.
ఈ మార్పుల దృష్ట్యా, మార్చి 1, 2025 నుండి అమలులోకి వచ్చేలా వాటికన్ సిటీ గవర్నరేట్ సెక్రటరీ జనరల్‌లుగా ఇద్దరు వ్యక్తులను నియమించారు.
ఈ రోజునే సిస్టర్ రఫెల్లా పెట్రిని, FSE, వాటికన్ సిటీ స్టేట్ పోంటిఫికల్ కమిషన్ మరియు గవర్నరేట్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
ప్రస్తుతం డికాస్టరీ ఫర్ ఎవాంజెలైజేషన్ (Section for First Evangelisation and New Particular Churches) అసిస్టెంట్ సెక్రటరీగా మరియు పోంటిఫికల్ మిషన్ సొసైటీల అధ్యక్షుడిగా పనిచేస్తున్న మహా పూజ్య ఎమిలియో నప్పాను; మరియు ఇప్పటివరకు వాటికన్ సిటీ గవర్నరేట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న న్యాయవాది గియుసేప్ పుగ్లిసి-అలిబ్రాండిని (Giuseppe Puglisi-Alibrandi ) పొప్ నియమించారు.
అదనంగా, సెక్రటరీస్ జనరల్‌కు అవసరమైన విధంగా నిర్దిష్ట విధులు మరియు బాధ్యతలను అప్పగించే అధికారాన్ని సిస్టర్ పెట్రినికి అప్పగించారు.