లిథువేనియా అధ్యక్షుడిని స్వాగతించిన కార్డినల్ పరోలిన్ 

సోమవారం మార్చి 3 వాటికన్‌లో లిథువేనియా రిపబ్లిక్ అధ్యక్షుడు గీతానాస్ నౌసెడాను (Gitanas Nausėda,) సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్డినల్ పియట్రో పరోలిన్ స్వాగతించారు.

జాతీయ జూబ్లీ తీర్థయాత్రలో పాల్గొనడానికి రోమ్‌లో ఉన్న లిథువేనియన్ అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో వాటికన్ రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి మహా పూజ్య పాల్ రిచర్డ్ కూడా పాల్గొన్నారు.

సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన చర్చల సందర్భంగా "ఫలవంతమైన ద్వైపాక్షిక సంబంధాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయబడింది, లిథువేనియన్ ప్రజల్లో క్రైస్తవ విశ్వాసం, సానుకూల సహకారాన్ని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ నుండి వచ్చిన ప్రకటన వెల్లడించింది

ఇరువురు ఉక్రెయిన్‌లో శాంతి అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించి, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్వభావం గల ప్రశ్నలపై దృష్టి సారించాయి" అని ముగించింది.