యేసే మన రక్షణ, మన వెలుగన్న పొప్ ఫ్రాన్సిస్

ఫిబ్రవరి 2 ,2025 ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో త్రికాల ప్రార్థనకు గుమిగూడిన యాత్రికులతో  దివ్య బాలయేసు సమర్పణ పండుగ విశిష్టత పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు.

క్రీస్తుప్రభువు కేవలం నాలుగు గోడలకు పరిమితమయ్యే వారు కాదని ఆయన మన కోసం నరావతారుడై ఈ లోకానికి వచ్చి, తన ప్రేమను పంచి మనకు నిత్యజీవాన్ని అనుగ్రహించారని  పోప్ వ్యాఖ్యానించారు.

హృదయ శుద్ధితో జీవించే వారికి దైవదర్శనం తప్పక లభిస్తుందని, వృద్ధుడైన సీమియోను బాలయేసును ఎత్తుకున్నారని ఆయనను కనులారా చూసే భాగ్యాన్ని పొందుకున్నారని  పోప్ అన్నారు.

మన హృదయ ద్వారాలను తెరిచి మనం కూడా ప్రభువును మన జీవితాల్లోకి ఆహ్వానించాలని, మన జీవితాలను, ఒక విలువైన కానుకగా దేవునికి సమర్పించాలని పోప్ తన సందేశాన్ని ముగించారు.