మోంటెనెగ్రో ప్రధాన మంత్రితో సమావేశమైన పోప్ లియో

శుక్రవారం జులై 4ఉదయం, వాటికన్ అపోస్టోలిక్ ప్యాలెస్‌లో Montenegro ప్రధాన మంత్రి Milojko Spajićను పోప్ లియో కలిశారు.
పోప్‌తో సమావేశమైన తర్వాత, ప్రధాన మంత్రి స్పాజిక్ సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో కార్డినల్ పియట్రో పరోలిన్ మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చ్ బిషప్ పాల్ రిచర్డ్ ను కలిసినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది
ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో సమావేశమయ్యారు, రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చ్ బిషప్ పాల్ రిచర్డ్ గల్లాఘర్‌తో కూడా సమావేశమయ్యారు.
సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చల సందర్భంగా, "ప్రస్తుత ద్వైపాక్షిక సంబంధాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశాయి మరియు శ్రీసభకు -రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన వివిధ ప్రశ్నలు చర్చించబడ్డాయి".
ఆ తర్వాత వారు వివిధ "ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు, పశ్చిమ బాల్కన్ దేశాలకు యూరోపియన్ యూనియన్ విస్తరణ మరియు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు".