మొదటి అంతర్జాతీయ మరియన్ సమావేశాన్ని నిర్వహించిన ఆంటీపోలో మేత్రాసనం

ఫిలిప్పీన్స్‌లోని ఆంటీపోలో మేత్రాసనం మొదటి అంతర్జాతీయ మరియన్ సమావేశాన్ని జనవరి 9 నుండి 11, 2025 వరకు నిర్వహించింది.

"ఈ శనివారం, జనవరి 11, 2025న ఉదయం 10:00 గంటలకు మొదటి మరియన్ అంతర్జాతీయ ఉత్సవంలో భాగంగా జరిగే మరియన్ సమావేశంలో మాతో చేరాలని మేము అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము" అని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

మనీలా మాజీ అగ్రపీఠాధిపతి మరియు సువార్తీకరణ విభాగ ప్రో-ప్రిఫెక్ట్ కార్డినల్ లూయిస్ ఆంటోనియో జి. టాగ్లే గారు "మన పవిత్ర మరియ తల్లి మన నిరీక్షణా యాత్రకు ఆదర్శం" అనే ఇతివృత్తంపై నిర్వహించనున్నారు.

ఈ మూడు రోజుల మరియన్ వేడుక ముగింపుగా దివ్యబలిపూజతో ముగియనుంది.