ముగిసిన కార్డినల్ల 12 వ సార్వత్రిక సమావేశం

మే 6వ తేదీ మంగళవారం ఉదయం, కాన్క్లేవ్ ప్రారంభానికి ముందు రోజు, 130 మంది కార్డినల్ ఎలక్టర్లతో సహా 173 మంది కార్డినల్లు పన్నెండవ సార్వత్రిక సమావేశంలో పాల్గొన్నారని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ Matteo Bruni జర్నలిస్టులతో జరిగిన సమావేశంలో వివరించారు.
హోలీ సీ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ కాన్క్లేవ్ వివరాల జాబితా గురించి కొన్ని నిర్దిష్ట వివరాలను వివరించారు.
మే 7 ఉదయం, Mass pro eligendo Pontifice దివ్యబలిపూజ జరుగుతుంది . తరువాత మధ్యాహ్నం 3:45 గంటలకు,కార్డినల్లు కాసా శాంటా మార్టా నుండి అపోస్టోలిక్ ప్యాలెస్‌కు కాన్క్లేవ్‌లోకి తీసుకువెళతారు.
గురువారం మే 8 ఉదయం 7:45 గంటలకు, కార్డినల్స్ శాంటా మార్టా నుండి అపోస్టోలిక్ ప్యాలెస్‌కు బయలుదేరుతారు మరియు ఉదయం 8:15 గంటలకు, వారు పౌలిన్ చాపెల్‌లో దివ్యబలి పూజ జరుపుకుంటారు. తరువాత, ఉదయం 9:15 గంటలకు, సిస్టీన్ చాపెల్‌లో మధ్యాహ్నం ప్రార్థన ఉంటుంది మరియు వారు ఓటింగ్ ప్రారంభిస్తారు.
పొగ వచ్చే సమయం ఉదయం 10:30 గంటల తర్వాత మరియు మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత కావచ్చునని ఆయన స్పష్టం చేశారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు, వారు భోజనానికి శాంటా మార్టాకు తిరిగి వస్తారు.
ఆ మధ్యాహ్నం, మధ్యాహ్నం 3:45 గంటలకు, వారు అపోస్టోలిక్ ప్యాలెస్‌కు తిరిగి వచ్చి, సాయంత్రం 4:30 గంటలకు సిస్టీన్ చాపెల్‌లో ఓటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తారు.
తెల్లటి పొగ సాయంత్రం 5:30 లేకుంటే సాయంత్రం 7:00 గంటల ప్రాంతంలో పొగ కనిపించే అవకాశం ఉందని బ్రూనీ గుర్తించారు.
ఓట్ల ముగింపులో, సిస్టీన్ చాపెల్‌లో ప్రార్థన ఉంటాయి మరియు సాయంత్రం 7:30 గంటలకు, వారు శాంటా మార్టాకు తిరిగి వస్తారు.