మరియతల్లిపై భక్తిని మరింత పెంచుకోవాలన్న XIV లియో పోప్

మే 25 న సెయింట్ జాన్ లాటరన్ బసిలికాలో ప్రార్థనలు నిర్వహించిన తర్వాత,XIV
లియో పోప్ సెయింట్ మేరీ మేజర్ బసిలికాను సందర్శించారు.
అక్కడ, ఆయన పౌలిన్ చాపెల్‌లో Salus Populi Romani (రోమన్ ప్రజల రక్షణ) చిహ్నం ముందు ప్రార్థన చేసి, పువ్వులు సమర్పించారు.
అనంతరం పోప్ ఫ్రాన్సిస్ సమాధి వద్ద XIV లియో పోప్ ప్రార్ధించారు.
సెయింట్ మేరీ మేజర్ బసిలికా వెలుపల గుముగూడిన విశ్వాసులకు, బసిలికాలో సేవ చేస్తున్న వారందరికీ, తనతో ఉన్న ఇద్దరు కార్డినల్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
దేవుని తల్లిపై మన భక్తిని మరింత పెంచుకోవాలని,ఆ మరియతల్లి మధ్యవర్తిత్వం ద్వారా మీ కుటుంబాలను, మీ ప్రియమైనవారిని - ఆశీర్వదించమని మరియు ఒకే కుటుంబంగా ఐక్యంగా శ్రీసభలో కలిసి ప్రయాణించడానికి మనకు సహాయం చేయమని దేవుడిని కోరుకుందాం" అని పొప్ ముగించారు.