మయన్మార్, కచిన్ రాష్ట్రానికి సహాయం అందించాలని పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్
ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రంలోని జాడే మైనింగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి జనవరి 13 న సంభవించిన విపత్కర కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో బాధపడుతున్న వారికి సహాయం అందించాలని పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
వాటికన్‌లో బుధవారం జరిగిన తన సామాన్య ప్రజల సమావేశంలో ఇటాలియన్ మాట్లాడే యాత్రికులను ఉద్దేశించి తన ముగింపు ప్రసంగంలో, మైనింగ్ ప్రాంతంలోని అనేక ఇళ్లను తాకిన కొండచరియను గుర్తుచేసుకున్నారు.
దీనివల్ల "ప్రాణనష్టం, తప్పిపోయిన వ్యక్తులు మరియు గణనీయమైన నష్టం జరిగింది".
అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, కనీసం ఒక 12 మంది మరణించారు, చాలా మంది తప్పిపోయారు మరియు 50 ఇళ్ళు మంటల వాళ్ళ బూడిదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలలో జరిగే లెక్కలేనన్ని హత్యలకు దోహదపడే ఆయుధ తయారీదారుల కొరకు ప్రార్థించాలని విశ్వాసులను కోరారు.