ఢిల్లీ కారు పేలుడును ఖండించిన క్రైస్తవ మతపెద్దలు

ఢిల్లీ కారు పేలుడును ఖండించిన క్రైస్తవ మతపెద్దలు  

ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో నవంబర్ 10 సాయంత్రం జరిగిన శక్తివంతమైన పేలుడులో 13 మంది మరణించినట్లు నివేదించబడిన వార్తలపై భారతదేశంలోని  క్రైస్తవ మతపెద్దలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

“పేలుడులో మరణించిన వారికి సంతాపం తెలియజేయడానికి మరియు గాయపడిన ప్రజలు త్వరగా కోలుకోవాలని న్యూఢిల్లీలోని క్రైస్తవలు ప్రార్థలతో ముందుకు వస్తున్నారని ” అని ఢిల్లీ అగ్ర పీఠ ప్రతినిధి ఫాదర్ సవరిముత్తు శంకర్ గారు అన్నారు.

పేలుడు వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసి శాంతిని కాపాడటానికి  ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కొరకు మరియు వారి బంధువుల పట్ల హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ CBCI(కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ) కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

“ఈలాంటి కష్ట సమయంలో మేము బాధితులకు తోడుగా ఉంటాము అని మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము,” అని ఆ ప్రకటన పేర్కొంది.

దేశంలోని పౌరులు అప్రమత్తంగా ఉండి, ఏవైనా అనుమానాస్పద కదలికలు లేదా  వస్తువులు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు లేదా స్థానిక అధికారులకు తెలియజేయాలని CBCI విజ్ఞప్తి చేసింది. 

 

*It's purely Telugu content, Please turn off Translation

Article and Design: M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer