భారత శ్రీసభ సినడల్ విధానంపై పత్రాన్ని విడుదల చేసిన CCBI

భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య CCBI భారతదేశ శ్రీసభ ప్రేషితకార్యంలో భాగస్వామ్య మరియు సినడల్ విధానంపై పత్రాన్ని 19 మార్చి 2025 న విడుదల చేసింది.

ఈ పత్రం సామాన్య విశ్వాసులు, గురువులు, దైవప్రజలు  మరియు పీఠాధిపతులతో కూడిన విస్తృతమైన, భాగస్వామ్య ప్రక్రియ ఫలితంగా రూపొందించబడింది.

జనవరి 28 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 36వ ప్లీనరీ అసెంబ్లీ సందర్భంగా ఇది సన్నాహక దశ, పని చేసే పత్రం మరియు పీఠాధిపతుల సమిష్టి ఆధ్యాత్మిక వివేచన ద్వారా రూపుదిద్దుకుంది.

132 మేత్రాసనాలు నుండి 145 మంది పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు మరియు కార్డినల్‌లను, 55 మంది మతాచార్యులు మరియు మత ప్రతినిధులతో కలిసి రూపొందించబడింది.

ఈ తుది పత్రం CCBI పాస్టరల్ ప్లాన్: మిషన్ 2033 తో సమానంగా ఉంటుంది, ఇది సమకాలీన  సవాళ్లను పరిష్కరించడానికి మరియు సువార్త ప్రచార ప్రభావవంతంగా మరియు ఫలవంతంగా బోదించేలా ప్రయత్నాలను పునరుజ్జీవింపజేయడానికి నిర్దిష్ట వ్యూహాలను అందిస్తుంది.

ఈ పత్రంలో పదహారు కీలక ఇతివృత్తాలు ఉన్నాయి 

CCBI అధ్యక్షుడు కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రాయో ఈ అంతర్దృష్టులను వారివారి మేత్రాసనాలలో అనుసంధానించాలని ఆయన అందరినీ ఆహ్వానించారు.

దేవుని ప్రజలకు కాపరులుగా, ప్రతి స్థాయిలో ఈ ప్రక్రియను ఉత్తేజపరిచే సమిష్టి బాధ్యత ఉందని, శ్రీసభ సభ్యులందరూ ఈ ప్రయాణంలో చురుకుగా పాల్గొనేలా చూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు