బొంబాయి సహాయక అగ్రపీఠాధిపతిగా మహా పూజ్య జాన్ రోడ్రిగ్స్ నియామకం
బొంబాయి అగ్రపీఠానికి సహాయక అగ్రపీఠాధిపతిగా మహా పూజ్య జాన్ రోడ్రిగ్స్ ను పోప్ ఫ్రాన్సిస్ గారు నియమిస్తూ నవంబర్ 30, 2024న ప్రకటన చేయడం జరిగింది.
జనవరి 25, 2025న బొంబాయి అగ్రపీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మహా పూజ్య జాన్ రోడ్రిగ్స్ గారు ఆగస్టు 21, 1967న బొంబాయి అగ్రపీఠంలో జన్మించారు.
ముంబై, గోరేగాన్ సెయింట్ పదవ పియస్ కాలేజీలో తత్వశాస్త్రం మరియు వేదాంత శాస్త్రాన్ని అభ్యసించారు.
ముంబై విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని మరియు రోమ్‌లోని పోంటిఫికల్ లాటరన్ విశ్వవిద్యాలయం నుండి డాగ్మాటిక్ థియాలజీలో లైసెన్షియేట్‌ను పొందారు.
ఏప్రిల్ 18, 1998 న బొంబాయి అగ్రపీఠ గురువుగా అభిషేకింపబడ్డారు.
1998 నుండి 1999 వరకు మాహిమ్‌లోని సెయింట్ మైఖేల్స్‌లో సహాయక విచారణ గురువుగా,
1999 నుండి 2000 వరకు బొంబాయి అగ్రపీఠ కార్యదర్శిగా
2002 నుండి 2013 వరకు డాగ్మాటిక్ థియాలజీ ప్రొఫెసర్ గా
2011 నుండి 2013 వరకు గోరేగాన్ సెయింట్ పదవ పియస్ కళాశాల డీన్ ఆఫ్ స్టడీస్ గా తన సేవను అందించారు
మే 15, 2013న బొంబాయి సహాయ పీఠాధిపతిగా నియమింపబడి, జూన్ 29, 2013న పీఠాధిపతిగా అభిషేకింపబడ్డారు
మార్చి 25, 2023న పూనా మేత్రాసనానికి బదిలీ చేయబడ్డారు