బెల్జియన్ బాధితులతో సమావేశమైన పోప్ లియో

శనివారం నవంబర్ 8 మధ్యాహ్నం బెల్జియంలో మైనర్లుగా ఉన్నప్పుడు మతాధికారుల వేధింపులకు గురైన పదిహేను మంది వ్యక్తులతో పోప్ లియో సమావేశమయ్యారు.

ఈ సమావేశం దాదాపు మూడు గంటల సేపు బాధితులతో సాన్నిహిత్యం,వారి వ్యధను ఆలకించి, చర్చించడం మరి కొడిసేపు వారికొరకు ప్రార్ధించడం జరిగింది అని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది

ఈ బృందంతో పాటు పాంటిఫికల్ మినర్ల రక్షణా విభాగ సభ్యులు కూడా ఉన్నారు. ఈ వినయాగం బెల్జియంలో మినర్ల రక్షణ సమస్యలపై స్థానిక చర్చితో కలిసి పనిచేస్తోంది.

గత జూలైలో పాంటిఫికల్ కమిషన్ ప్రతినిధి బృందం బెల్జియంను సందర్శించినప్పుడు ప్రారంభమైన సంభాషణను కొనసాగించడానికి ఈ కమిషన్ అదే బృందంతో మరలా సమావేశమైంది.