ఫాతిమామాత కథడ్రల్ వత్తాసు బాలబాలికల దినోత్సవం
వరంగల్ మేత్రాసనం,ఫాతిమానగర్, ఫాతిమామాత కథడ్రల్ నందు అక్టోబర్ 31,2024 న మరియమాత జపమాల (పూజిత) మాస ముగుంపు వేడుకను, వత్తాసు బాలబాలికల దినోత్సవాన్ని మరియు దీపావళి ని ప్రార్థనాపూర్వకంగా మరియు అర్థవంతంగా జరుపుకున్నారు.
దాదాపు 40 మంది వత్తాసు బాలబాలికలు దీనిలో పాల్గొన్నారు.
వరంగల్ పాస్ట్రాల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ జోసఫ్ తాటికొండ, విచారణ కర్తలు గురుశ్రీ కాసు మర్రెడ్డి,మాజీ సహాయ విచారణ గురువులు గురుశ్రీ కరుణాకర్ SJ మరియు ఇతర పూజారులు కాళీ సమిష్టి పూజను సమర్పించారు
గురుశ్రీ జోసఫ్ తాటికొండ గారు "జపమాల యొక్క ప్రాముఖ్యత గురించి బోధించారు, బలిపీఠం సేవ సమయంలో బాలబాలికలు వ్యవహరించవలసిన విధానాన్ని మార్గనిర్దేశం చేశారు మరియు వారికి జపమాలను అందించారు.
దివ్యబలి పూజ అనంతరం దీపావళికి ప్రతీకగా దేవాలయ క్యాంపస్ చుట్టూ కొవ్వొత్తులు మరియు పరిశుద్ధ జపమాలతో ఊరేగింపు జరిగింది.
దాదాపు 1200 మంది విశ్వాసులు దీనిలో పాల్గొన్నారు. విచ్చేసిన వారికి ప్రేమ విందును కూడా ఏర్పాటుచేశారు