ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు
ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు
విజయవాడ మేత్రాసనం, ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో "సెమి క్రిస్మస్ వేడుకలు - 2025" ఘనంగా జరిగాయి. యువత మార్గచుపరి, ప్రేరణ యూత్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జోజి తంబి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విజయవాడ పీఠాధిపతులు మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు గారు పాల్గొని అమూల్యమైన క్రిస్మస్ సందేశాన్ని విశ్వాసులకు అందించారు.
అధికసంఖ్యలో గురువులు ,కన్య స్త్రీలు మరియు యువతీ యువకులు ఈ "సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు.
ఆటలపోటీలలో గెలుపొందిన వారికీ మొమెంటోస్ అందించారు. వివిధ విచారణాల నుండి పాల్గొన్న యువతీ యువకులు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో యువత చురుకుగా పాల్గొన్నారు. ఆధ్యంతం కన్నుల పండుగగా ఈ సెమి క్రిస్మస్ వేడుకలు జరిగాయి.
Article by M Kranthi Swaroop