ప్రేమాజ్ఞ విశిష్టతను వివరించిన పోప్ లియో

జులై 13 న రోమ్ సమీపంలోని కొండపై ఉన్న పట్టణానికి వచ్చిన యాత్రికులతో కలిసి పొప్ లియో త్రికాల ప్రార్ధన మరియు సాంప్రదాయంగా వారు చేస్తున్న మరియతల్లి ప్రార్థనను జపించారు
freedom squareలో గుమిగూడిన వారిని ఉద్దేశించి పోప్ సువార్తలో యేసును అడిగిన ప్రశ్నను “బోధకుడా, నిత్యజీవాన్ని వారసత్వంగా పొందాలంటే నేను ఏమి చేయాలి?” అనే దానిపై ధ్యానించారు
ఆ వ్యక్తి ప్రశ్న మానవ హృదయం యొక్క లోతైన కోరికను వ్యక్తపరుస్తుందని పోప్ అన్నారు.
మనం బలవంతంగా శాశ్వత జీవితాన్ని పొందలేము లేదా దానిని పొందడానికి చర్చలు జరపలేము, కానీ మనం దానిని వారసత్వంగా పొందాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలకు వారసత్వంగా ఇస్తారో మన దేవుడు మాత్రమే ఆ శాశ్వత జీవితాన్నిఇవ్వగలరు.
దేవుణ్ణి మన హృదయపూర్వకంగా ప్రేమించడం మరియు మన పొరుగువారిని మనలాగే ప్రేమించడం ఈ రెండు పనులు చేసినప్పుడు, మనం ఆ తండ్రి ప్రేమకు అర్హులమవుతాం
దేవుడిని మరియు మన పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞ అన్ని మానవ చట్టాలను అధిగమిస్తుందని గుర్తుచేసుకుంటూ పోప్ లియో ముగించారు.