ప్రపంచ శాంతి దినోత్సవ సందేశాన్ని విడుదల చేసిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జనవరి 1, 2025 న రాబోయే ప్రపంచ శాంతి దినోత్సవం సందర్బంగా "మా అపరాధాలను క్షమించి, మీ శాంతిని మాకు దయచేయుము." అనే నేపధ్యాన్ని ఆవిష్కరించారు .

ఈ ఇతివృత్తం డిసెంబర్ 24న ప్రారంభం కానున్న జూబిలీ సంవత్సరం 2025కి క్షమాపణ మరియు నిరీక్షణను సమలేఖనం చేస్తుంది. 

పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ నేపధ్యాని ఎన్సైక్లికల్స్ , ముఖ్యంగా లౌదాతొ సి మరియు ఫ్రాటెల్లీ తుట్టి నుండి ప్రేరణ పొందినాట్లు డికాస్టరీ ఫర్ ప్రమోటింగ్ ఇంటెగ్రల్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ప్రకారం తెలుస్తుంది.

ఈ జూబిలీ సంవత్సరం "  సయోధ్యను, సమాధానాన్ని పెంపొందించుకోవటానికి కానీ మనల్ని ఖండించడానికి కాదు" అని ఆగష్టు 8న డికాస్టరీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఇతివృత్తం సామాజిక మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణ యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది 

వాటికన్ ప్రకటన ప్రకారం, “ నిజమైన శాంతిని పెంపొందించాలి అంటే అన్ని స్థాయిలలో- వ్యక్తిగతమైన, స్థానిక, అంతర్జాతీయ స్థాయిలలో మార్పు చాలా అవసరం" అని తెలిపారు.

ఈ పరివర్తిత ప్రక్రియ " గాయాలను మాన్పుతున్న కొత్త వాస్తవంలో, ప్రతి వ్యక్తి యొక్క గౌరవం గుర్తించబడుటకు " దారితీస్తుందని ఆశిస్తున్నారు  

ప్రపంచ శాంతి సాధనలో క్షమాపణ అనేది ఒక కీలకమైన అంశం పోప్ ఫ్రాన్సిస్ గారి నమ్మకం

జూబిలీ సంప్రదాయంలో భాగంగా సంపన్న దేశాలు "పాపాల క్షమాపణ, అప్పుల రద్దు" చేయులాగున విజ్ఞప్తి చేయడానికి వాటికన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది.

రుణ విముక్తి కొరకు పిలుపు " అనేక అవసరమైన ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్థిక, పర్యావరణ, సాంస్కృతిక మార్పులకు" స్ఫూర్తినిచ్చే సాధనంగా రూపొందించబడింది.

ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా, క్షమాపణ మరియు సంబంధాల పునరుద్ధరణపై దృష్టి సారించి, రాబోయే సంవత్సరం కోసం ఒక బలమైన నిరీక్షణా సందేశాన్ని మరియు పరివర్తనను అందిస్తుంది.