ప్రపంచ మెథడిస్ట్ కౌన్సిల్ ప్రతినిధి బృందంతో సమావేశమైన పోప్ ఫ్రాన్సిస్
పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ప్రపంచ మెథడిస్ట్ కౌన్సిల్ ప్రతినిధి బృందంతో సమావేశమైయ్యారు.
నిసియా కౌన్సిల్ 1,700 వ వార్షికోత్సవం కంటే ముందు క్రైస్తవ సమైక్యత ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది.
ప్రపంచ మెథడిస్ట్ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల మంది విశ్వాసులు ఉన్న సంఘం.
కతోలిక మరియు మెథడిస్ట్‌లు మధ్య ఉన్న దూరాన్ని అధిగమించి, గత 60 సంవత్సరాలుగా "పరస్పర జ్ఞానం, అవగాహన మరియు సంభాషణలు కొనసాగిస్తునందుకు పోప్ ఫ్రాన్సిస్ దేవునికి కృతజ్ఞతలు తెలిపారు.
పవిత్రాత్మ మార్గదర్శకత్వంలో మన “భిన్నమైన మనస్సులు మరియు సంకల్పాలను” ఏకం చేయడానికి ప్రయత్నించాలని పోప్ ఫ్రాన్సిస్ ఆహ్వానించారు.
"ఎల్లప్పుడూ క్రీస్తు హృదయంపై దృష్టి కేంద్రీకరించాలి, ఎందుకంటే ఆ హృదయం నుండి మనం ఒకరితో ఒకరు బాగా సంబంధం కలిగి ఉండటం మరియు దేవుని రాజ్యానికి సేవ చేయడం నేర్చుకుంటాము. ." అని ఆయన అన్నారు
ప్రపంచ మెథడిస్ట్ కౌన్సిల్, కతోలిక శ్రీసభ మధ్య అంతర్జాతీయ సంయుక్త కమిషన్ లో పనిచేసిన వేదాంతులు, పాస్టర్లకు పోప్ ఫ్రాన్సిస్ కృతజ్ఞతలు తెలిపారు.