పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రకటించిన వాటికన్

మన విశ్వాస కాపరి స్వర్గీయ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఈ శనివారం ఏప్రిల్ 26 ఉదయం 10 గంటలకు అనగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ ప్రకటించింది.
పోప్ అంతిమ సంస్కారాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంతో పాటు తదుపరి పోప్‌ను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభంపై అందుబాటులో ఉన్న కార్డినల్స్‌తో మంగళవారం ఏప్రిల్ 22 కీలక సమావేశం జరిగింది.
బుధవారం నుంచి పోప్ ఫ్రాన్సిస్ భౌతికకాయాన్ని సెయింట్ పీటర్స్ బాసిలికాలో ప్రజల సందర్శనార్థం ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
అలాగే పోప్ భౌతికకాయం ఫొటోలను కూడా వాటికన్ మొదటిసారిగా విడుదల చేసింది.
గతంలో మరణించిన పోప్‌ల అంత్యక్రియల సుదీర్ఘ క్రతువుకు భిన్నంగా అతి సాధారణంగా నిర్వహించాలని పోప్ ఫ్రాన్సిస్ కోరుకున్నారు.
తనను ఇతర పోప్‌లను ఖననం చేసిన సెయింట్ పీటర్స్ బాసిలికాలో కాకుండా వాటికన్ వెలుపల ఉన్నసెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో పూడ్చిపెట్టాలన్న ఆయన కోరికకు అనుగుణంగానే అంత్యక్రియల విధానాన్ని మార్చారు.