పొప్ ఫ్రాన్సిస్ మరణాన్ని అధికారికంగా ధృవీకరించిన డాక్టర్ ఆండ్రియా ఆర్కాంజెలి

పోప్ ఫ్రాన్సిస్ మరణంపై ఎలక్ట్రో కార్డియోగ్రాఫిక్ థానటోగ్రఫీ ద్వారా నిర్ధారించబడిన అధికారిక వైద్య నివేదికను వాటికన్ సిటీ స్టేట్ హెల్త్ అండ్ హైజీన్ డైరెక్టరేట్ డైరెక్టర్ డాక్టర్ ఆండ్రియా ఆర్కాంజెలి విడుదల చేశారు.
గుండెపోటు, తరువాత కోమా, గుండె మరియు రక్తప్రసరణ వ్యవస్థ విఫలమవడం పోప్ ఫ్రాన్సిస్ మరణానికి కారణం అని గుర్తించారు.
డాక్టర్ Andrea Arcangeli అధికారిక ధృవీకరణ పత్రం జారీ చేశారు మరియు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ సోమవారం ఏప్రిల్ 21 సాయంత్రం నివేదికను విడుదల చేసింది.
పోప్‌కు మల్టీమైక్రోబయల్ న్యుమోనియా, బహుళ bronchiectases, అధిక రక్తపోటు మరియు టైప్ II డయాబెటిస్ కారణంగా తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం వుంది అని మునుపటి వైద్య నివేదిక తెలిపింది
electrocardiographic thanatography ద్వారా పొప్ ఫ్రాన్సిస్ మరణం నిర్ధారించబడింది.
“నా జ్ఞానం మేరకు, పొప్ ఫ్రాన్సిస్ మరణానికి కారణాలు పైన పేర్కొన్న విధంగానే ఉన్నాయని నేను ప్రకటిస్తున్నాను” అని డాక్టర్ ఆర్కాంజెలి రాశారు.