పునీత పట్టం పొందనున్న మరో ఐదుగురు దైవసేవకులు

క్రీస్తు రక్తంలో కడగబడి,ఆయన కొరకు ప్రేమ త్యాగం చేసిన 5 గురు దైవ సేవకులను పొప్ ఫ్రాన్సిస్ పునీతులుగా ప్రకటించనున్నారని వాటికన్ ఒక ప్రకటనలో తెలిపింది.
1 .న్యూ గినియాకు చెందిన ధన్య Peter To Rot, మార్చి 5, 1912న జన్మించారు.
క్రైస్తవ విశ్వాసంలో విద్యనభ్యసించి, ఉపదేశి అయ్యాడు మరియు అతని జీవితం దాతృత్వం, వినయం మరియు పేదలు ,అనాథల పట్ల అంకితభావంతో నిండి ఉంది.
2 .ప్రస్తుత టర్కియేలోని Mardiలో 1869లో జన్మించిన ధన్య Ignatius Choukrallah Maloyan కూడా పునీత పాఠం పొందనున్నారు. వీరు ARMENIAN అగ్రపీఠాధిపతిగా ఉన్నపుడు మారణహోమం సమయంలో అమరవీరుడైయ్యారు
3 .ఆగస్టు 11, 1903న కారకాస్‌లో Carmen Elena Rendíles Martínez గా జన్మించిన ధన్య Maria del Monte Carmeloకు ఆపాదించబడిన అద్భుతాన్ని పోప్ గుర్తించినందున, వెనిజులాకు మొదటి స్థానిక పునీతులు వీరు.
4 బారికి చెందిన ఇటాలియన్ గురువు ధన్య Carmelo De Palma జనవరి 27, 1876న జన్మించారు
5 .19వ శతాబ్దపు గురువుగా మారిన బ్రెజిలియన్ రాజకీయ నాయకుడు José Antônio de Maria రోచిత సద్గుణాలను పొప్ గుర్తించి వీరికి పునీత పట్టం ఇవ్వనున్నారని వాటికన్ ప్రకటించింది.