పునీత జోజప్ప విశ్వసనీయత, విశాలతకు ప్రతిరూపమన్న పొప్ ఫ్రాన్సిస్
బుధవారం 29 జనవరి వాటికన్‌లో సామాన్య ప్రజల సమావేశంలో పునీత జోజప్ప గారి విశ్వాసం, నిష్కాపట్యత మరియు ప్రేమను సుమాత్రుకగా తీసుకోవాలని పొప్ ఫ్రాన్సిస్ విశ్వాసులను ఆహ్వానించారు.
"యేసే మన ఆశ" అనే జూబ్లీ సంవత్సర ఇతివృత్తంపై పొప్ వ్యాఖ్యానించారు.
పునీత జోజప్ప గారు గొప్ప విశ్వాసం మరియు నమ్మకంతో మరియను తన భార్యగా స్వీకరించి, దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్చడంలో ఆయన కృషిని పొప్ గుర్తుచేశారు
మన జీవితాలలో క్రీస్తును స్వాగతించడంలో ,దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో పునీత జోజప్ప గారి వినయాన్ని మనం నేర్చుకోవాలని పొప్ ఫ్రాన్సిస్ ముగించారు