పీఠాధిపతుల డికాస్టరీని సందర్శించిన XIV లియో పోప్

మే 20 మంగళవారం ఉదయం XIV లియో పొప్ పీఠాధిపతుల డికాస్టరీని సందర్శించారని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటించింది.
అక్కడ వారు జనవరి 2023 నుండి మే 8న పోప్‌గా ఎన్నికయ్యే వరకు ప్రిఫెక్ట్‌గా తన సేవను అందించారు.
డికాస్టరీ ప్రార్థనా మందిరంలో పోప్ లియో ప్రార్థనలు నిర్వహించారని ప్రకటన పేర్కొంది.
ఉదయం 10 గంటల ప్రాంతంలో Piazza Pio XIIలోని డికాస్టరీ కార్యాలయానికి తన మినీవ్యాన్‌లో వెళ్లారు.
పోప్ ను చప్పట్లతో స్వాగతం పలికారు; మరియు సెయింట్ పీటర్స్ కాలొనేడ్ నుండి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న స్క్వేర్‌లో గుమిగూడిన ఒక చిన్న సమూహం “పోప్ వర్ధిల్లాలి” అని నినాదాలు చేసారు.
నిర్దిష్ట చర్చిల స్థాపన మరియు ఏర్పాటుకు సంబంధించిన అన్ని విషయాలకు మరియు
లాటిన్ చర్చిలో ఎపిస్కోపల్ కార్యాలయ నిర్వహణకు, సువార్తికరణ డికాస్టరీ సామర్థ్యాని పక్షపాతం లేకుండా పీఠాధిపతుల డికాస్టరీ బాధ్యత వహిస్తుంది.