పిల్లలను శ్రామిక యంత్రాలుగా మార్చకూడదన్న పోప్ ఫ్రాన్సిస్
పిల్లలపై దోపిడీ జరగకుండా వారిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జనవరి 15 సాధారణ ప్రేక్షకుల సమావేశంలో పొప్ అన్నారు.
పిల్లలు చదువులకు, ఆటలకు దూరం చేసి, శ్రామిక యంత్రాలుగా మార్చడాన్ని పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పిల్లలు తమ కనీస హక్కులైన విద్య, ఆరోగ్యం, ఆటపాటలు కోల్పోయి, పొట్టకూటి కోసం తమ చిట్టి చేతులతో వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నారని ఇటువంటి దుస్థితి ఎంతో ఆవేదన కలిగిస్తుందని పోప్ అన్నారు.
పిల్లల అక్రమ రవాణా కూడా ఆందోళన కలిగించే అంశమని పేదరికంతో అలమటించే చిన్నారి బిడ్డలు విద్యకు దూరం కాకూడదని ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి బంగారు భవిష్యత్తును కల్పించే దిశగా అడుగులు వేయాలని పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.